అప్పటి టాప్ హీరోయిన్ కు.. ఇప్పుడు ప్రచారం.. ఎందుకంటే..?

Tuesday, November 17th, 2015, 11:35:55 AM IST

samantha
తమిళ్ నుంచి తెలుగు ఇండస్ట్రీకి పరిచయం ఆయన ఎనర్జిటిక్ హీరోయిన్ సమంత. ఏం మాయ చేశావే తో టాలీవుడ్ ఇండస్ట్రీని మాయ చేసి టాప్ హీరోయిన్ లిస్టు లో చేరిపోయింది. దాదాపు టాప్ హీరోలందరితో సినిమాలు చేసింది. ఇటు తెలుగులోనూ.. అటు ఆమె మాతృభాష తమిళ్ లోను వరస సినిమాతో వరుస హిట్లతో ఓ వెలుగు వెలిగింది.

అయితే, ఇటీవల కొంత కాలంగా.. సమంత నటిస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడుతున్నాయి. పైగా.. అనుష్క, శృతిహాసన్ ల జోరు పెరగడంతో.. సమంత డిమాండ్ తగ్గిపోతున్నది. సినిమాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో సమంత ఆలోచనలో పడింది. తనకు ఇప్పుడు ప్రచారం కావాలి. వెండితెరపై ఎలాగైనా ఇంకొంతకాలం నిలబడాలి అంటే.. ప్రచారం చేసుకోక తప్పదు. ఇంగ్లీష్, తెలుగు పబ్లికేషన్స్ లో సమంతకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. వారు సమంతను మీడియాలో ప్రమోట్ చేసే బాధ్యతలను తీసుకున్నారు. ఆమెను అనుకూలంగా స్టోరీస్ రాయడం మొదలుపెట్టారు. తను నటిస్తున్న సినిమాలు బోల్తా కొడుతున్నా… అందుకు కారణం తాను కాదని, ఎప్పటిలాగే బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చేందుకు ప్రయత్నించానని సినిఇండస్ట్రీకి తెలియజేసేందుకే సమంత ప్రచారం చేసుకోవాలని చూస్తున్నదట.