ఆ ఆవు ఎద్దు నిజమైన ప్రేమకు ఫిదా అయిన సమంత..!

Friday, September 11th, 2020, 03:45:53 PM IST

ప్రస్తుతం మనిషి మనిషికి మధ్య సంబంధాలు తొలగొపోతున్నాయి. ఈర్ష్య, అసూయ, అహంకారాలు పెరిగిపోతున్నాయి. ఒక్కోసారి మనుషుల కన్నా జంతువులే మేలు అనిపిస్తుంది. అయితే ఓ ఆవు ఎద్దు కథ చూస్తుంటే నిజమైన సంబంధాలు, ప్రేమానురాగాలు గుర్తొస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం కరోనా ప్రభావంతో తమిళనాడులోని మధురైలో ఆర్థికంగా కుదేలైన ఓ రైతు తన వద్ద ఉన్న ఆవును మరో గ్రామానికి చెందిన రైతుకు విక్రయించాడు.

అయితే ఆ ఆవును ఆటోలో తరలిస్తుంటే స్థానిక ఆలయంలో ఉండే ఎద్దు దానికి అడ్డుపడింది. ఇంతవరకు కలిసిమెలసి ఉన్న తమను విడదీయకండని ఆటో వెనుక పరుగులు తీస్తూ ప్రాదేయపడింది. అయితే ఈ వీడియో చూసి తమిళనాడు ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చిన్న కుమారుడు జయప్రదీప్ ఆ ఆవును కొని తిరిగి స్థానిక కమిటీకి అప్పగించారు. దీంతో కొద్ది రోజుల క్రితమే ఆ ఆవు, ఎద్దు తిరిగి కలిసిపోయాయి. అయితే ఈ ఆవు ఎద్దు నిజమైన ప్రేమ అప్పట్లో ప్రతి ఒక్కరి హార్ట్స్ టచ్ చేసింది. తాజాగా దీనిపై అక్కినేని సమంత కూడా స్పందిస్తూ నిజమైన ప్రేమ ఎప్పటికి చెదిరిపోదు అన్న దానిని ఏకీభవిస్తూ హార్ట్ ఎమోజీనీ పోస్ట్ చేసింది.