చైతూ నా గురించే ఆలోచిస్తున్నావా? – సమంత

Monday, January 18th, 2021, 01:46:21 PM IST

థాంక్యూ సినిమా సెట్స్ లో అక్కినేని నాగ చైతన్య చాలా బిజీ గా ఉన్నారు. అయితే ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ పీసీ శ్రీరామ్. అయితే ఆయన తీసిన ఫొటోలను చైతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అతని తో పనిచేయడం ఎంతో గౌరవం అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాగ చైతన్య చేసిన పోస్ట్ పై తన భార్య, ప్రముఖ నటి సమంత సైతం స్పందించారు. నా గురించే ఆలోచిస్తున్నావా అంటూ సమంత కామెంట్ చేశారు. అయితే ఈ పోస్ట్ ఇప్పుడు నెటిజన్ల కంట పడింది. వారు దీని పై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

అటు పక్క లవ్ స్టోరీ, థాంక్యూ చిత్రాలతో నాగ చైతన్య బిజీ గా ఉండగా, సమంత సామ్ జామ్ మరియు ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ లతో బిజీ గా ఉన్నారు. అటు నాగ చైతన్య, ఇటు సమంత చేసిన వ్యాఖ్యలతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పోస్ట్ సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.