సలార్ మూవీ లో విలన్ అతనే?

Sunday, February 7th, 2021, 11:00:49 AM IST

సలార్ చిత్రం షూటింగ్ ఒక పక్క శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం ను ప్రముఖ కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. కేజీఎఫ్ చిత్రం తర్వాత ప్రశాంత్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడం తో సెట్స్ మీద ఉన్నప్పటి నుండి సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా ను పాన్ ఇండియా గా విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం లో ప్రభాస్ కి జోడీ గా శృతి హాసన్ కనిపించనున్నారు. అయితే ఇంతటి మాస్ మూవీ లవ్, ప్రభాస్ సరసన విలన్ పాత్ర కి కూడా చాలా హైప్ ఉంటుంది. అలాంటిది మొదటి నుండి ఈ చిత్రం లో ప్రభాస్ కి విలన్ గా ఎవరు నటిస్తారు అనే దాని పై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి.

అయితే ఈ సినిమా లో ఒక కీలక పాత్ర చేస్తున్నట్లు నటుడు మధు గురుస్వామి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సలార్ లో నటించడం ఎంతో ఆనందంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి అవకాశం ఇచ్చిన ప్రశాంత్ నీల్ కి, హాంబల్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అయితే మధు గురుస్వామి చేసిన పోస్ట్ పై నెటిజన్లు స్పందిస్తున్నారు. విలన్ పాత్ర లో నటిస్తున్నట్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ప్రభాస్ కటౌట కి విలన్ కూడా అదే రేంజ్ లో ఉండాలి అంటూ కొందరు చెబుతున్నారు. మరి దీని పై చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అటు ప్రభాస్ రాధే శ్యామ్ పూర్తి చేసుకొని, సలార్ మరియు ఆదిపురుష్ లలో ఏక కాలంలో నటిస్తున్నారు. నాగ్ అశ్విన్ లో మరొక సినిమా చేసేందుకు సిద్దం అవుతున్నారు.