సలార్ చిత్రానికి ముహూర్తం ఫిక్స్…మరొక క్రేజీ అప్డేట్

Thursday, January 14th, 2021, 02:31:04 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం రాధే శ్యామ్ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ నెల 19 నుండి ఓం రౌత్ దర్శకత్వం లో తెరకెక్కనున్న ఆది పురుష్ చిత్రం లో నటించేందుకు ప్రభాస్ సిద్దంగా ఉన్నారు. మరొక క్రేజీ ప్రాజెక్ట్ సైతం ఇటీవల ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. సలార్ చిత్రం లో ప్రభాస్ హీరో గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. వరుస సినిమాలు అనౌన్స్ చేయడం పట్ల ప్రభాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అయితే సలార్ చిత్రానికి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ఏమిటంటే, ఈ చిత్రం పూజ కార్యక్రమం రేపు ప్రారంభం కానుంది. అయితే హైదరాబాద్ లో జరగనున్న ఈ ప్రారంభానికి తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమ కి చెందిన ప్రముఖులు హజరు కానున్నారు. అయితే ఈ చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా దిశా పటాని నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాక బాలీవుడ్ ప్రముఖ హీరో జాన్ అబ్రహం విలన్ పాత్రను పోషించనున్నట్లు సమాచారం. ఇప్పటికే సలార్ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ టైటిల్ తో పాటు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబో అనడంతో అభిమానుల్లో సైతం ఈ చిత్రం పై ఆసక్తి నెలకొంది.