పేదల భూములను బలవంతంగా లాక్కున్నారు.. చంద్రబాబుపై సజ్జల ఫైర్..!

Saturday, March 27th, 2021, 08:05:58 AM IST

ఏపీ రాజధాని అమరావతిలో జరిగిన ల్యాండ్‌ పూలింగ్‌ వ్యవహారం ప్రపంచంలోనే అతి పెద్ద స్కాం అని ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. టీడీపీ నేతలు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని, పేదల భూములను బలవంతంగా లాక్కున్నారన్నారు. అసైన్డ్‌ భూములను బెదిరించి తీసుకున్నారని దీని వల్ల చంద్రబాబు ఆయన బినామీలకు మేలు చేకూరిందని అన్నారు. వాస్తవాలు వెలుగులోకి వస్తాయనే భయంతోనే సీఐడీ విచారణను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.

అయితే పేదల భూములు లాక్కున్నాక ల్యాండ్‌పూలింగ్‌లో మార్పులు చేస్తూ టీడీపీ సర్కారు జీవో 41 ఇచ్చిందని అన్నారు. ఎవరినో బెదిరించి, బలవంతంగా సంతకాలు చేయించి సీఐడీ కేసు దాఖలు చేసిందని టీడీపీ నేతలు ఆరోపణలు చేయడం దారుణమని అన్నారు. పేదలకు చెందిన అసైన్డ్‌ భూములను చంద్రబాబు, తన బినామీదారులు రాయించుకున్న తర్వాత ల్యాండ్‌ పూలింగ్‌ నిబంధనలు మార్చాల్సిన అవసరం ఏముందని సజ్జల ప్రశ్నించారు. అయితే సీఐడీ విచారణలో అసైన్డ్‌ భూములను చంద్రబాబు బినామీలు లాక్కుని ప్రభుత్వం నుంచి లబ్ధి పొందినట్లు తేలిందని అవినీతి జరిగిందనడానికి ఇంతకన్నా ఆధారాలు ఏం కావాలని సజ్జల అన్నారు.