జననేత పాదయాత్రకు మూడేళ్లు

Thursday, November 5th, 2020, 07:34:55 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రకి శ్రీకారం చుట్టి మూడేళ్లు అవుతుండటం తో ఈ నెల 6 వ తేదీ నుండి 10 రోజుల పాటుగా వైసీపీ అధ్వర్యంలో ప్రజా చైతన్య కార్యక్రమాలను పండుగలా నిర్వహించాలి అని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. జననేత పాదయాత్రకు మూడేళ్లు పోస్టర్ ను తాడేపల్లి లోని కార్యాలయంలో ఆవిష్కరించారు. నవంబర్ 6 న ఇడుపుల పాయ లో పాదయాత్ర మొదలు పెట్టిన జగన్ ఏపీ లోని 134 నియోజక వర్గాల్లో 3,648 కిలోమీటర్ల మేర 14 నెలలు పాటుగా ఇచ్చాపురం వరకు సాగింది అని చెప్పుకొచ్చారు.

అయితే జనంలో తాను కూడా పర్యటించిన విషయాన్ని గుర్తు చేశారు. సీఎం వైఎస్ జగన్ ఓకే జాబితా లో 175 మంది అసెంబ్లీ నియోజక వర్గ అభ్యర్ధులను, 25 మంది ఎంపీ అభ్యర్ధులను ప్రకటించడం చూశామని, ఇది కూడా ఒక చరిత్ర అంటూ కొనియాడారు. అయితే మొదటి 14 నెలలు జనంలో ఉంది, 17 నెలలుగా జనం కోసం ప్రభుత్వం ను నడుపుతూ ప్రజల కోసమే అంకితం అవుతూ పాలన కొనసాగిస్తున్నారు అని తెలిపారు.