అభివృద్ది తో రాష్ట్రాన్ని సీఎం జగన్ గాడినపెట్టారు – సజ్జల రామకృష్ణ రెడ్డి

Sunday, November 1st, 2020, 05:30:22 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వైసీపీ కార్యాలయాల్లో వేడుకలు నిర్వహించారు. అయితే వేడుకల్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ రెడ్డి పాల్గొన్నారు. జాతీయ జెండా ఆవిష్కరించి, పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూల మాలలు వేసి, ఘన నివాళి అర్పించారు. అయితే ఈ కార్యక్రమం లో పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

గత ప్రభుత్వ పాలకుల వల్లే ఆరేళ్లుగా విభజన అన్యాయం జరిగింది అని సజ్జల రామకృష్ణ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రం వెనుకబాటు లో ఉందని తెలిపారు. అయితే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ది తో రాష్ట్రాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి గాడిన పెట్టారు అని తెలిపారు. అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి దేశంలోనే రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా తీర్చి దిద్దుతారు అని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే తెలుగు వారందరీ బంగారు భవిష్యత్ కోసం పాటు పడిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని, అయితే వైసీపీ కి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని జగన్ నేతృత్వం లో సఫలం చేస్తామని తెలిపారు. కార్యకర్తలు అంతా కూడా సీఎం జగన్ వెంట మడమ తిప్పని సైనికులు గా పని చేయాలని సజ్జల రామకృష్ణ రెడ్డి సూచించారు.