చంద్రబాబు జోకర్‌లా మారుతున్నాడు.. వైసీపీ నేత సజ్జల హాట్ కామెంట్స్..!

Tuesday, October 6th, 2020, 08:17:44 AM IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సహజంగా ప్రతిపక్షాలు ప్రజా సమస్యలపై అధికార పార్టీతో పోరాటం చేస్తాయి. కానీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, డీజీపీ గౌతం సవాంగ్‌కు లేఖలపై లేఖలు రాస్తూ జోకరులా మారుతున్నారని ఎద్దేవా చేశారు.

అయితే అంతకు ముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు, ఇప్పుడు డీజీపీకి లేఖలు రాస్తున్నారని, వీటిని పట్టుకుని చంద్రబాబు కోర్టులకు వెళ్తారేమో అని సజ్జల ఎద్దేవా చేశారు. అయితే నేరాలపై విడుదలయిన గణాంకాల్లో తప్పులున్నాయని వాటిని సరిదిద్దేందుకు సమయం పడుతుందని ఈలోపే డీజీపీకి చంద్రబాబు లేఖ రాయడమేంటని సజ్జల ప్రశ్నించారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయని, ఏ రాష్ట్రంలో లేని విధంగా దేశంలో ఏపీ పోలీసులపైనే అత్యధిక కేసులు నమోదవ్వడం రాష్ట్రానికి సిగ్గుచేటని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కి చంద్రబాబు వరుస లేఖలు రాసిన సంగతి తెలిసిందే.