మతం పేరుతో టీడీపీ నీచ రాజకీయాలు చేస్తోంది – సజ్జల రామకృష్ణారెడ్డి

Thursday, September 24th, 2020, 02:40:24 PM IST

తెలుగు దేశం పార్టీ తీరు పై అధికార పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలుగు దేశం పార్టీ తీరు పై మండిపడ్డారు. మతం పేరుతో టీడీపీ నీచ రాజకీయాలు చేస్తోంది అని విమర్శించారు. అమరావతి భూ కుంభకోణం పై నుండి దృష్టి మరల్చడానికే టీడీపీ ఇలా ప్రవర్తిస్తుంది అని తెలిపారు.అయితే తమ రాజకీయ స్వార్థం కోసం తెలుగు దేశం పార్టీ కి చెందినటువంటి నేతలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు అని ఆరోపణలు చేశారు.

అయితే టీడీపీ అనుకూల మీడియా ద్వారా వార్తలు ప్రసారం చేసుకుంటున్నారు అని,కుట్ర పూరితం గా ఇలాంటి దాడులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో జరుగుతున్నాయి అని సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే ఈ హిందూ దేవాలయాల దాడుల వెనుక ప్రధాన ప్రతి పక్షం ఉంది అని, హిందూ మతం పై విశ్వాసం తో కాదు అని,అధికారం లో లేము అనే బాధతో ప్రతి పక్షాలు ఇలా వ్యవహరిస్తున్నాయి అని తెలిపారు. అయితే అసత్య ప్రచారం చేస్తూ ప్రతి పక్ష పార్టీ నేతలు అభాసు పాలు అవుతున్నారు అంటూ సజ్జల రామకృష్ణ వ్యాఖ్యానించారు.