చంద్రబాబు రాజధాని కోసం వసూలు చేసిన చందాలు ఏమయ్యాయి?

Monday, September 14th, 2020, 12:00:39 AM IST

ప్రతి పక్ష పార్టీ నేతలు, తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్ ల తీరు పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహా సజ్జల రామకృష్ణ రెడ్డి మరొకసారి ఘాటు విమర్శలు చేశారు. సుదీర్ఘ కాలం లో అధికారం లో ఉన్న చంద్రబాబు నాయుడువాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు అని విమర్శించారు. సంక్షేమ పథకాల పైన కూడా చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని అన్నారు.నారా లోకేష్ ఎంత చదువుకొ నీ ఏమి ప్రయోజనం, వ్యాట్ పై ఇచ్చిన జీఓ కూడా చదవకుండా సోషల్ మీడియా లో ట్వీట్ చేస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు.

నారా లోకేష్ కి ఏమీ తెలియకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ సజ్జల రామకృష్ణ రెడ్డి ఆరోపణలు చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనా విధానం పై ప్రశంసలు చేస్తూనే, ప్రతి పక్ష పార్టీ నేతల పై విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు కుల,మత రాజకీయాలు చేస్తున్నారు అని అన్నారు.కరోనా వైరస్ కష్ట కాలం లో ఎటుపోయారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని కోసం చంద్రబాబు నాయుడు వసూలు చేసిన చందాలు ఏమై పోయాయి అంటూ సూటి గా ప్రశ్నించారు.మతాన్ని అడ్డుపెట్టుకొని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు అని, మీడియా మేనేజ్మెంట్ చేయడం లో చంద్రబాబు దిట్ట అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.