వాటికి కూడా ప్రజలు చరమగీతం పాడారు – సజ్జల రామకృష్ణా రెడ్డి

Thursday, March 4th, 2021, 03:37:42 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో సార్వత్రిక ఎన్నికల నుండి తెలుగు దేశం పార్టీ కి భంగపాటు తప్పడం లేదు. అయితే వైసీపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలతో, అమలు చేస్తున్న పథకాల తో ప్రజల్లో కాస్త ఆదరణ పెరుగుతోంది. అయితే తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్ధులు నామినేషన్లు వేయడం పట్ల ప్రభుత్వం సలహా దారు సజ్జల రామకృష్ణా రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పదవుల ఎంపిక లో, అభ్యర్ధుల నిర్ణయం లో సీఎం జగన్ పారదర్శకం గా వ్యవహరిస్తారు అని పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వడం, పార్టీ కోసం ముందు నిలబడిన వారిని గుర్తించి సమపాళ్ళలో సముచిత స్థానాలు ఇవ్వడం ద్వారా ఎక్కడ చిన్నపాటి సమస్య కూడా ఉండదు అని తెలిపారు. అయితే కష్టపడి పనిచేసే వారికి పార్టీ లో గుర్తింపు ఉంటుంది అని అందరూ గుర్తించారు అని వ్యాఖ్యానించారు.

అయితే ఈ నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ చావు దెబ్బ తిన్న తర్వాత కౌన్సిల్ లో ఉన్న మంద బలాన్ని, ఆసరా గా చేసుకొని, సాంకేతిక కారణాలు చూపి, రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలిగించే పనులు చేయడాన్ని ప్రజలు అంతా కూడా గమనించారు అని వ్యాఖ్యానించారు. అయితే వాటికి కూడా ప్రజలు చరమగీతం పాడారు అని అన్నారు.అయితే వచ్చే మే తో వైసీపీ కి కౌన్సిల్ లో మెజారిటీ వస్తుంది అని పేర్కొన్నారు. ఎంపికైన ఎమ్మెల్సీలకి సజ్జల రామకృష్ణా రెడ్డి అభినందనలు తెలియజేశారు.