రాజకీయ ప్రయోజనం పొందేందుకే ఇలా – సజ్జల రామకృష్ణారెడ్డి

Friday, September 18th, 2020, 08:50:30 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో జరుగుతున్నా పరిణామాల పై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. దేవాలయాల్లో అక్కడక్కడ జరిగే కొన్ని ఘటనలతో రాజకీయం ప్రయోజనం పొందాలనుకొని కొన్ని శక్తులు ఏకం అవుతున్నట్లు అనిపిస్తుంది అని తెలిపారు. దేవాలయాల్లో కావాలనే ఇలాంటి సంఘటనలు సృష్టించే ప్రయత్నం జరుగుతోంది అని ఆరోపణలు చేశారు. లేకపోతే రోజూ ఏదో ఒక ఆలయం లో ఎందుకు జరుగుతుంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశం లో ఎక్కడా స్పందించ ని విధంగా అంతర్వేది ఘటన లో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది అని,అధికారుల పై చర్యలు తీసుకోవడం మాత్రమే కాకుండా, విచారణ జరుపుతుంది అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పోలీసులు కూడా తగు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అయితే సీఎం జగన్ పాలన విధానం చూసి, ప్రజల్లో పథకాల పై చర్చ అడ్డుకొనేందుకు ప్రతి పక్ష పార్టీ లు ప్రయత్నిస్తున్నాయి అని తెలిపారు. గత తో పాలన లో ఇలాంటి ఘటనలు జరిగితే ప్రభుత్వం పట్టించుకోలేదు అని, ప్రజలే సమస్యలు పరిష్కరించుకునే ప్రయత్నం చేశారని అన్నారు.

అయితే రాజకీయ పార్టీలు ప్రజల సమస్యల పై పోరాటం చేసి, ప్రజల కోసం నిలబది ఓట్లు తెచ్చుకోవాలి కానీ, ఇలాంటి ఘటన ల ద్వారా అడ్డదారుల్లో ఓట్లు తెచ్చుకోవాలన్న ఆలోచన ప్రతి పక్ష పార్టీ ల్లో కనిపిస్తుంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు.