రమేష్ కుమార్ కి తొందరెందుకు – సజ్జల రామకృష్ణ రెడ్డి

Wednesday, November 18th, 2020, 03:33:31 PM IST

రాబోయే ఫిబ్రవరి లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కి ఎన్నికల కమిషనర్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే వైసీపీ కి మాత్రం ఎన్నికలను ఇప్పుడు నిర్వహించడం నచ్చడం లేదు. అయితే ఈ వ్యవహారం పై రాష్ట్ర ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఒక ప్రభుత్వ గా ప్రజల అందరి బాధ్యత తమ పై ఉంది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు వద్దు అని అంటున్నాము అని తెలిపారు. అయితే ఒక రాజకీయ పార్టీ గా ఎన్నికలు ఎప్పుడు జరిగినా అందుకు సిద్దం అంటూ చెప్పుకొచ్చారు.

అయితే సీఎం జగన్ ప్రజల మనిషి అన్న విషయం అందరికి తెలిసిందే అని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా 90 శాతానికి పైగా సీట్లు గెలుచు కుంటాం అని అన్నారు. అయితే ఒకటి, రెండు కరోనా కేసులు ఉన్నప్పుడు ఎన్నికలను వాయిదా వేసి, ఇప్పుడు వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతుంటే ఎలా ఎన్నికలు నిర్వహిస్తారు అని సూటిగా ప్రశ్నించారు. అయితే ఒక పక్క చీఫ్ సెక్రెటరీ ఎన్నికలు నిర్వహించలేం అని అంటుంటే, నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి తొందరెందుకు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే కరోనా వైరస్ మహమ్మారి తగ్గిన తర్వాతే ఎన్నికలు జరగాలి అని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది అని, ఆ రోజే ఎన్నికలు పూర్తి చేసి ఉంటే బావుండేది అని అన్నారు. అయితే వాయిదా వెనుక ఉద్దేశ్యాలు, నిమ్మగడ్డ వ్యవహార శైలి ఆ తర్వాత అర్దం అయింది అంటూ వ్యాఖ్యానించారు.