నిమ్మగడ్డ లో ఫ్యాక్షనిస్ట్ ధోరణి కనిపిస్తుంది

Thursday, January 28th, 2021, 08:39:16 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పంచాయతీ ఎన్నికల నిర్వహణ కి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు విధుల నిర్వహణ విషయం లో అధికారుల పట్ల సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఎన్నికల నిర్వహణ కి రమేష్ కుమార్ తీసుకుంటున్న చర్యల పట్ల అధికార పార్టీ కి చెందిన పలువురు నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఏకగ్రీవాల విషయం లో ప్రత్యేక చర్యలు తీసుకోవడం మాత్రమే కాకుండా, ప్లాన్ బి అంటూ చేసిన వ్యాఖ్యల పట్ల కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మేరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనుసరిస్తున్న ధోరణి పై రాష్ట్ర ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు చేతిలో నిమ్మగడ్డ కీలు బొమ్మలా మారిపోయారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కమిషనర్ కీలు బొమ్మలా వ్యవహరించడం దురదృష్ట కరం అంటూ చెప్పుకొచ్చారు. నిమ్మగడ్డ లో ఫ్యాక్షనిస్ట్ ధోరణి కనిపిస్తుంది అని, రిటైర్డ్ అధికారి అయి ఉండి, ఇతర అధికారుల పై వ్యవహరిస్తున్న తీరు బాధాకరం అంటూ చెప్పుకొచ్చారు.