బిగ్ న్యూస్: చంద్రబాబు, నారాయణ పాత్రల పై సీఐడీ విచారణ!

Friday, March 26th, 2021, 06:02:33 PM IST

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి లో తెలుగు దేశం పార్టీ నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్ కి పాల్పడ్డారు అని వ్యాఖ్యానించారు. దళితులను బెదిరించి అసైన్డ్ భూములను లాక్కున్నారు అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు, ఆయన బినామీలు పేదల భూములను చౌకగా కొట్టేశారు అని, ఈ ల్యాండ్ పూలింగ్ ప్రపంచంలోనే అతి పెద్ద స్కాం అంటూ సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే భూములు కొన్న తర్వాత ల్యాండ్ పూలింగ్ నిబంధనలను మార్చి తమ వారికి లబ్ది చేకూర్చారు అని, దానికి సంబందించినదే జీఓ 41 అంటూ చెప్పుకొచ్చారు. అయితే దీనిలో చంద్రబాబు నాయుడు, నారాయణ పాత్ర ఉందని, ఇందుకు సంబంధించి సీఐడీ విచారణ చేస్తుంది అని వ్యాఖ్యానించారు.

అయితే చంద్రబాబు నాయుడు తనకు ఉన్న అలవాటు ప్రకారం స్టే తెచ్చుకున్నారు అని, ఆయనకు రాజధాని మీద ప్రేమ లేదు అని వ్యాఖ్యానించారు. వేల ఎకరాల భూమి దోచుకునేందుకే ఇదంతా చేశారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే అక్కడి భూములు దోచుకునేందుకు ఆయన, ఆయన తాబేదార్ల వేసిన ప్లాన్ అమరావతి అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే టీడీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు పట్ల సజ్జల రామకృష్ణ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.