చంద్రబాబు రాజకీయంగా పతనం అయ్యారు

Thursday, January 21st, 2021, 04:10:48 PM IST

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. డీజీపీ పై చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు సరికాదు అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సంతబొమ్మాళి లో నంది విగ్రహం తొలగించింది టీడీపీ నేతలే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు తీరు దబాయింపు ధోరణి లో ఉందని, ఆయన మానసిక స్థితి ఏమనుకోవాలో అర్ధం కావడం లేదు అని, చంద్రబాబు శాడిజం ఏంటో అర్ధం కావడం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే 41 సియర్పిసి notice గురించి బాబుకి అవగాహన లేదా అంటూ సూటీగా ప్రశ్నించారు. అయితే విగ్రహాలను ఎవరైనా రాజకీయ నాయకులు తీసుకు వెళతారా, బాబు కి ఎందుకు ఇంత ఆవేశం, ఫ్రస్ట్రేషన్ అంటూ వరుస ప్రశ్నలు గుప్పించారు. అయితే చంద్రబాబు వ్యాఖ్యలు చిన్న పిల్లల కంటే అధ్వాన్నంగా ఉన్నాయి అని, జగన్ ను టార్గెట్ చేయడమే బాబు లక్ష్యం అంటూ చెప్పుకొచ్చారు. నిన్న జరిగింది కళా వెంకట్రావు అరెస్ట్ కాదు అని, నోటీసులు మాత్రమే ఇచ్చారు అని అన్నారు. ఆయన అరెస్ట్ కాకపోయినా అలా ఎందుకు మాట్లాడతారు అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే చంద్రబాబు నాయుడు రాజకీయం గా పతనం అయ్యారు అంటూ విమర్శించారు.