రాజకీయం గా దివాలా తీసి అడ్రస్ గల్లంతు అయిన టీడీపీ కి ఇలాంటివి ప్రయోజనకరం

Wednesday, January 6th, 2021, 07:36:15 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఒక పథకం ప్రకారమే ఆలయాల పై దాడులు జరుగుతున్నాయి అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు. ప్రతి పక్షాలు ప్రమాదకర రాజకీయాలు చేస్తున్నాయి అని తెలిపారు. కుల మతాలకు అతీతంగా సీఎం జగన్ పాలన కొనసాగిస్తున్నారు అని, కానీ ప్రతి పక్షాలు అత్యంత ప్రమాదకర రాజకీయాలకి తెరలేపారు అని, మతాలు, దేవుళ్లతో పార్టీలు ఆడుకుంటున్నాయి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే దీని పై సజ్జల రామకృష్ణ రెడ్డి వరుస వ్యాఖ్యల తో ప్రతి పక్ష పార్టీ నేతల పై ఘాటు విమర్శలు చేశారు.

వరుసగా, ఒక పథకం ప్రకారం ఎక్కడైతే భద్రత ఏర్పాట్లు సరిగ్గా ఉండవో, జన సంచారం ఉండదో అక్కడ చిన్న చిన్న గుళ్లను టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు అంటూ తెలిపారు. విగ్రహాలను విరగ్గొట్టడం వెంటనే ఉద్యమాలు చేపట్టడం చేస్తున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఇలా రాష్ట్రంలోని విగ్రహాలకి నష్టం కలిగించడం ద్వారా సీఎం జగన్ కి, వైసీపీ కి ఎం ప్రయోజనం అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే జగన్ ఇలాంటి తుచ్ఛమైన, నీచమైన అలోచనలు చేయరు అని అన్నారు. అంతేకాక పేదలకు పట్టాలు ఇస్తున్న సందర్భంలో ప్రభుత్వం దీని గురించి సంబంధించిన పబ్లిసిటీ పొందాలి అని అనుకుంటుందా అని అన్నారు. అయితే రాజకీయంగా దివాలా తీసి అడ్రస్ గల్లంతు అయిన టీడీపీ కి ఇలాంటివి ప్రయోజనకరం అంటూ సంచలన ఆరోపణలు చేశారు.