చంద్రబాబు పక్క రాష్ట్రంలో అజ్ఞాతవాసిగా కాలం గడుపుతున్నారు

Tuesday, October 6th, 2020, 12:00:55 AM IST


తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పై ప్రభుత్వం చీఫ్ విప్ సజ్జల రామకృష్ణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి పక్ష పాత్ర పోషించడం రాదు అని, దొడ్డి దారిన అధికారం చేజిక్కించుకున్న చంద్రబాబు కి ప్రజల కష్టాలు తెలియవు అని విమర్శించారు. గత ఆరు నెలలు గా చంద్రబాబు నాయుడు పక్క రాష్ట్రంలో అజ్ఞాతవాసిగా కాలం గడుపుతున్నారు అని అన్నారు. చంద్రబాబు నాయుడు డీజీపీ కి లేఖ రాయడం పట్ల విమర్శలు చేశారు. ఆయన సమస్య ఎంటో తెలుసుకోవాలి అని అనుకుంటున్నా అని అన్నారు.

అయితే చంద్రబాబు కి తెలిసింది ఒక్కటే, అధికారం లో ఉండటం, అయితే అది గోడ దూకితే వస్తుందా అంటూ వరుస విమర్శలు గుప్పించారు. అయితే డీజీపీ బదులు ఇవ్వాలి అంటే కొన్ని పరిధులు ఉంటాయి అని అన్నారు. అయితే డీజీపీ కి ఎందుకు రాస్తున్నారు అంటూ సూటిగా ప్రశ్నించారు.అంతేకాక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నా చంద్రబాబు నాయుడు విమర్శలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక జోకర్ ల ఒకసారి జూమ్ మీటింగ్ కూడా పెట్టారు, ఏదైనా చేస్తే సీరియస్ గా ఉండాలి జోకర్ లా మారితే ఎలా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.