బాబు గారు ఇలా ఆధారాలు ఎందుకు చూపడం లేదు?

Thursday, August 20th, 2020, 01:43:37 AM IST


ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేతలు ఆరోపిస్తున్న అంశాలను లేవనెత్తి, ఆధారాలు చూపించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ చీఫ్ విప్ సజ్జల రామ కృష్ణ రెడ్డి సోషల్ మీడియా ద్వారా ఒక సంచలన పోస్ట్ చేశారు. తాము ప్రతి పక్షం లో ఉన్నపుడు వైసీపీ నాయకుడు గా ఉన్న తన ఫోన్ ను చంద్రబాబు నాయుడు ట్యాపింగ్ చేయించారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.అంతేకాక అందుకు సంబంధించిన ఆధారం లను న్యాయస్థానాలకు సమర్పించిన విషయాన్ని తెలిపారు. అందుకు సంబంధించిన పత్రాలను సైతం సజ్జల రామ కృష్ణ రెడ్డి పోస్ట్ చేశారు.

అయితే ఇపుడు ట్యాపింగ్ జరిగింది అని ఆరోపిస్తున్న చంద్రబాబు నాయుడు ఇలా ఆధారాలు ఎందుకు చూపడం లేదు అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే ఇప్పటికే టీడీపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వం వైఖరి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కి చంద్రబాబు లేఖ రాసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ప్రధాని నరేంద్ర మోడీ స్పందించక మునుపే ఇలా స్పందించడం ఏమిటి, అంటూ విమర్శలు చేస్తున్నారు. ఇపుడు సజ్జల రామ కృష్ణ రెడ్డి చేసిన పోస్ట్ తో టీడీపీ నేతలు మళ్లీ ఎలా స్పందిస్తారో చూడాలి.

Attachments area