చంద్రబాబు దానికి కూడా అర్హుడు కాదు అని నిరూపించుకున్నారు – సజ్జల రామకృష్ణా రెడ్డి

Monday, March 15th, 2021, 12:01:00 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ఘోర ఓటమి చవి చూసింది. అమరావతి అంశం తో బలం గా ఉందనుకున్న పలు స్థానాల్లో సైతం టీడీపీ ఓడింది. అయితే ఈ మేరకు తెలుగు దేశం పార్టీ పై వైసీపీ కి చెందిన నేతలు వరుస విమర్శలు చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు సజ్జల రామకృష్ణా రెడ్డి మున్సిపల్ ఎన్నికల ఫలితాలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.

వైఎస్ జగన్ తన రెక్కల కష్టంతో నిర్మించుకున్న పార్టీ వైఎస్సార్ పార్టీ అని చెప్పుకొచ్చారు. పార్టీ గెలుపు క్రెడిట్ అంతా ఆయనను ఆశీర్వదించిన ప్రజలదే అని వ్యాఖ్యనించారు. అక్కా చెల్లెలు, అన్నదమ్ములు, అవ్వా తాతలు తన వైపు ఉన్నారని సీఎం వైఎస్ జగన్ కి భరోసా ఉందని అన్నారు. నేడు అదే నిజమైంది అని వ్యాఖ్యానించారు. వారి కుటుంబంలో ఒకరిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డినీ గుర్తించారు అని వ్యాఖ్యానించారు. దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఈ ఫలితాలు వచ్చాయి అని వ్యాఖ్యానించారు. అయితే ఒక నాయకుడి పై ఇంత భరోసా చూపడం ఇదే తొలిసారి అని అన్నారు.

అయితే చంద్రబాబు నాయుడు వైఖరి ను గుర్తు చేస్తూ సజ్జల రామకృష్ణా రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రచారం పేరిట ప్రజల్ని బూతులు తిట్టారు అని అన్నారు. ఇప్పుడు వెళ్లి హైదరాబాద్ లో కూర్చున్నారు, ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా అక్కడే ఉన్నారు అని అన్నారు. మేము ప్రతి పక్షం ఉండాలని కోరుకుంటున్నాం అని, కానీ చంద్రబాబు దానికి కూడా అర్హుడు కాదు అని నిరూపించుకుంటున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.