ఎన్నికల కోడ్ ఉందని చంద్రబాబు కి తెలియదా – సజ్జల రామకృష్ణా రెడ్డి

Monday, March 1st, 2021, 03:19:19 PM IST

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అబద్దాలతో చంద్రబాబు నాయుడు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు అని, టీడీపీ కి అభ్యర్ధులు కూడా దొరకని పరిస్థతి నెలకొంది అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పంచాయతి ఎన్నికల ఫలితాలే మున్సిపల్ ఎన్నికల్లోనూ సాధిస్తాం అని ధీమా వ్యక్తం చేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పథకాలు ప్రతి పేదవాడికి అందుతున్నాయి అని వ్యాఖ్యానించారు. మునిసిపల్ ఎన్నికల్లో అందరూ కలిసి కట్టుగా పనిచేసి విజయం సాధిస్తాం అని అన్నారు.

అయితే తిరుపతి ఎయిర్పోర్ట్ లో చంద్రబాబు డ్రామా సృష్టించారు అంటూ ధ్వజమెత్తారు. తెలుగు దేశం పార్టీ నేతలను బెదిరించాల్సిన అవసరం తమకు లేదు అని, చంద్రబాబు తన పార్టీ పరిస్థతిపై ఆత్మ పరిశీలన చేసుకోవాలి అంటూ విమర్శించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనుమతి లేకుండా తిరుపతి కి వచ్చి బాబు నానా యాగీ చేస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కోడ్ ఉందని చంద్రబాబు కి తెలియదా అంటూ సూటిగా ప్రశ్నించారు. ఎన్నికలు ప్రశాంతం గా జరిగితే, చంద్రబాబు మాత్రం దౌర్జన్యాలు జరిగాయి అని అంటున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు హామీలను ఎందుకు నెరవేర్చలేదో ప్రజలంతా కలిసి బాబు ను నిలదీయాలి అంటూ చెప్పుకొచ్చారు.