చంద్రబాబు గారు ఇంకా ఎందుకు అబద్ధాలు – సజ్జల రామకృష్ణ రెడ్డి

Tuesday, February 23rd, 2021, 07:33:16 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో విడతల వారీగా పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. అయితే ఈ ఎన్నికల్లో నాల్గవ విడత లో తెలుగు దేశం పార్టీ 1,100 కి పైగా స్థానాల్లో విజయం సాధించింది అంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం జరిగింది. అంతేకాక తెలుగు దేశం పార్టీ కి చెందిన నేతలు సైతం అదే తరహాలో వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారం పై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి స్పందించారు. తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరి పట్ల ఘాటు వ్యాఖ్యలు చేస్తూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎందుకు అబద్ధాలు, తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు అంటూ సూటిగా ప్రశ్నించారు.

అయితే పంచాయతీ ఎన్నికల్లో మా పార్టీ మద్దతు దారులు ఎక్కడెక్కడ గెలిచారో ఫోటోలు సహా జాబితాలను ysrcppolls.in అనే వెబ్ సైట్ లో పెట్టి విడుదల చేశాం అని అన్నారు. అయితే మీ వాళ్లు ఎక్కడ గెలిచారో ఫోటోలు సహా జాబితాలు విడుదల చేయగలరా అంటూ నిలదీశారు. అయితే రెండేళ్ల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన తీర్పును, ప్రజలే ఇప్పుడు తిరగరాశారు అంటూ చెప్పుకొచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి నిజాయితీ, నిబద్దతతో హామీలను నెరవేర్చిన జగన్ గారే మరో 30 ఏళ్లు సీఎం గా ఉండాలి అనే రీతిలో తీర్పు చెప్పారు అంటూ సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు.