కొంతమంది ఓటమిని వేడుక చేసుకోవడం విడ్డూరంగా ఉంది – సజ్జల రామకృష్ణ రెడ్డి

Wednesday, February 10th, 2021, 04:30:14 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పంచాయితీ ఎన్నికల తోలి విడత ఫలితాలు తమ పార్టీ కి అనుకూలంగా వచ్చాయి అంటూ ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వలనే ఇలా జరిగింది అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక అమరావతి ప్రాంతం లో కూడా వైసీపీ మంచి ఫలితాలను సాధించింది అంటూ గుర్తు చేశారు. అయితే ఈ తోలి విడత పంచాయతీ ఎన్నికల్లో 81 శాతం కి పైగా వైసీపీ మద్దతు దారులే గెలిచారు అని వ్యాఖ్యానించారు. అయితే కొంతమంది ఓటమిని వేడుక చేసుకోవడం విడ్డూరంగా ఉందని సజ్జల రామకృష్ణ రెడ్డి సెటైర్స్ వేశారు. అయితే తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా ఓటమిని హుందాగా అంగీకరించాలి అని అన్నారు.

అయితే తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్ధుల ఫోటోలను నేడు తమ వెబ్ సైట్ లో ఉంచనున్న విషయాన్ని సజ్జల రామకృష్ణ రెడ్డి వివరించారు. అయితే వెల్లడించిన ఫలితాల్లో ఏవైనా తప్పులు చూపిస్తే సరిచేసుకుంటాం అని అన్నారు. అయితే ఈ తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ మద్దతు దారులు ఎక్కువ శాతం విజయం సాధించడం జరిగింది అంటూ వైసీపీ నేతలు చెబుతున్నారు.