ఏడాదిలో ఒక వ్యవస్థను పకడ్బందీగా తీర్చి దిద్దాం – సజ్జల రామకృష్ణ రెడ్డి

Friday, October 2nd, 2020, 07:00:47 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో జరుగుతున్న పరిణామాల పై ప్రభుత్వ చీఫ్ విప్ సజ్జల రామకృష్ణ రెడ్డి మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని వ్యవస్థలు రాజ్యాంగ బద్దంగా ఏర్పడ్డాయి అని, ఏ వ్యవస్థ అయినా, ఇతర వ్యవస్థలను గౌరవించాలి అని తెలిపారు. ఎల్లో మీడియా ప్రభుత్వం పై బురద జల్లే కార్యక్రమాలు చేస్తోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు ను మూసేయమనండి అంటూ రాసిన పిచ్చి రాతలు ఆశ్చర్య పరిచాయి అని తెలిపారు.

రాజకీయ వ్యవస్థ బావుంది అని మేము అనడం లేదు, అలా అని మిగతా వ్యవస్థలు బావున్నాయి అని కూడా చెప్పలేం అంటూ చేసిన వ్యాఖ్యలు గుర్తు చేశారు. న్యాయస్థానాలు ఇలాంటి వ్యాఖ్యలు చేయాలని అనుకుంటే రికార్డ్ చేసి తీర్పు లో భాగం చేయాలని సూచించారు. ఏ సమస్య అయినా ఉన్నత న్యాయస్థానాలే పరిష్కరించాలని, రాష్ట్రం లో చిన్న చిన్న ఘటనలను మొత్తం రాష్ట్రానికే ఆపాదించడం బాధాకరం అని అన్నారు.

పోలీస్ వ్యవస్థ పై సైతం పలు ప్రశంసలు కురిపించారు. గ్రామ స్వరాజ్య స్థాపన దిశగా పయనిస్తున్నాం అని, గ్రామ సచివాలయ వ్యవస్థ తో గడప వద్దకే సేవలు అందజేస్తున్న విషయాన్ని తెలిపారు. ఏడాది లో ఒక వ్యవస్థ ను పకడ్బందీ గా తీర్చి దిద్ధాం అని సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు.