తిరుపతి ఎన్నికల్లో నాలుగు లక్షల మెజారిటీ తో గెలుస్తాం – సజ్జల రామకృష్ణా రెడ్డి

Wednesday, March 24th, 2021, 07:09:05 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన వ్యాఖ్యల పై ఘాటుగా స్పందించారు. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించ లేకపోవడానికి కోవిడ్ వాక్సినేషన్ సాకుగా చూపించడం లో దురుద్దేశం ఉందని అన్నారు. అయితే ఆరు రోజుల్లో అయిపోయే పనిని ఆపేసి వెళ్తున్నారు అని వ్యాఖ్యానించారు. అయితే కొత్త ఎన్నికల కమిషనర్ తో ఎన్నికలు నిర్వహించమని కోరుతామని అన్నారు. కరోనా కంట్రోల్ లోనే ఉందని, వాక్సిన్ కార్యక్రమం ను వేగవంతం చేస్తామని అన్నారు.

అయితే నాలుగు వారాల్లో కోటి మందికి వాక్సిన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు అని సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. అయితే ఇసుక టెండర్ విషయం లో టీడీపీ నేతలు చేస్తున్న విమర్శల పై స్పందించారు. చిన్న పిల్లలు కూడా నవ్వుతారు టీడీపీ నేతలు ఇసుక పై చేస్తున్న విమర్శలు చూస్తుంటే అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక త్వరలో జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికలో నాలుగు లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.