ఓటమిని కూడా చంద్రబాబు విజయంలా భావిస్తున్నారు – సజ్జల

Friday, February 12th, 2021, 08:02:43 PM IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. వెన్నుపోటులు పొడిచి అధికారం కబ్జా చేయడం చంద్రబాబు నైజం అని అన్నారు. పక్క వాళ్ళ మీద పడి ఏడవటం చంద్రబాబుకు అలవాటుగా మారిందని, పంచాయతీ ఎన్నికల్లో కూడా చంద్రబాబు అదే తీరుతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

అయితే పంచాయితీ ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు మరోసారి బుద్ధి చెప్పారని అయినా ఓటమిని కూడా చంద్రబాబు గెలుపులా చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 38.74 శాతం పంచాయితీలు మావే అని చెప్పుకుంటున్నారని మేం గట్టిగా వివరాలు చెప్పే సరికి ప్లేటు ఫిరాయించారని అన్నారు. ఓ పక్క వైసీపీ దౌర్జన్యాలకు పాల్పడిందని అంటూనే ఎక్కువ పంచాయితీలు గెలిచాం అని చెబుతున్నారని అసలు చంద్రబాబు చెప్పే దాంట్లో ఏది నిజం అని నిలదీశారు. కొత్తగా ఇప్పుడు ఎస్ఈసీనీ వేస్ట్ అనే రీతిలో మాట్లాడుతున్నారని చివరకు జనానిది కూడా తప్పు అనే స్వభావం చంద్రబాబు నాయుడిది అని సజ్జల అన్నారు.