సూపర్ స్టార్ మహేష్ అందానికి పడిపోయా అంటున్న సాయి పల్లవి

Thursday, December 17th, 2020, 04:38:36 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువనే అన్న విషయం అందరికి తెలిసిందే. అయితే అందులో లేడీ ఫ్యాన్స్ కూడా మహేష్ కి చాలా ఎక్కువ. అయితే ఈ లిస్ట్ లో క్రేజీ భామ ఫిదా హీరోయిన్ సాయి పల్లవి కూడా ఉంది. తాజాగా సాయి పల్లవి ఒక ఇంటర్వ్యూ లో మహేష్ బాబు పై పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

మహేష్ బాబు చాలా అందంగా ఉంటారు అంటూ కామెంట్స్ చేసింది. ఏ సమయం లో అయినా ఆయన స్కిన్ మెరిసి పోతుంది అని తెలిపారు. మహేష్ బాబు ఫోటోలు చూసి ఫిదా అవుతుంటా అని అన్నారు. ఒక వ్యక్తి ఎంత పర్ ఫెక్ట్ గా ఎలా ఉంటారు అని అనుకుంటా అని అన్నారు. అయితే మహేష్ బాబు ఫొటోలను జూమ్ చేసి చూస్తా అని, అందులో ఆయన మొఖం పైన ఒక్క మచ్చ కూడా ఉండదు అని అన్నారు. సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు. సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాయి పల్లవి నాగ చైతన్య తో కలిసి లవ్ స్టోరీ చిత్రం లో నటిస్తున్న సంగతి తెలిసిందే.