పవర్ ఫుల్ పాత్రలో సాయి ధరమ్ తేజ్… రిపబ్లిక్ టీజర్ విడుదల

Monday, April 5th, 2021, 12:17:37 PM IST

సాయి ధరమ్ తేజ్ వరుస సినిమాలు చేస్తూ తెలుగు సినీ పరిశ్రమ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. చిత్రలహరి సినిమా తో హిట్ ట్రాక్ లోకి వచ్చిన ఈ యంగ్ హీరో, అనంతరం ప్రతి రోజూ పండగే వంటి ఫ్యామిలీ మూవీ తో హిట్ కొట్టారు. ఆ తర్వాత సోలో బ్రతుకే సో బెటర్ అంటూ ఆడియెన్స్ ను ఆకట్టుకున్నారు. సాయి ధరమ్ తేజ్ చేసి ప్రతి సినిమా కూడా ఆడియెన్స్ ను అలరిస్తోంది. అయితే దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న రిపబ్లిక్ మూవీ లో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన పోస్టర్ విడుదల అయినప్పటి నుండి సినిమా పై అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఈ చిత్ర యూనిట్ టీజర్ ను విడుదల చేసింది.

ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు హక్కో, లేదా అరిచే హక్కొ అనే భ్రమ లో ఉన్నాం అంటూ డైలాగ్ తో టీజర్ మొదలైంది. అయితే ఈ చిత్రం పొలిటికల్ డ్రామా గా ఉన్నట్లు తెలుస్తోంది. ఒక పవర్ ఫుల్ పాత్రలో సాయి నటిస్తున్నారు. రమ్యకృష్ణ కీలక పాత్ర లో నటిస్తున్నారు. జూన్ 4 వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కేవలం 64 రోజుల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అయితే ఈ టీజర్ విడుదల కావడం తో సాయి పాత్ర పై, సినిమా పై ఒక అంచనా కి రావడం తో బొమ్మ హిట్ అంటూ అంతా కామెంట్స్ చేస్తున్నారు.