ఆ బాద ఎలా ఉంటుందో నాకు తెలుసు – సచిన్ టెండూల్కర్

Thursday, October 1st, 2020, 02:24:08 PM IST

ఐపీఎల్‌లో కళ్ళు చెదిరే బ్యాటింగ్, భయబ్రాంతులకు గురిచేసే బౌలింగ్, అబ్బురపరిచే ఫీల్డింగ్ ఇలా రకరకలా ఫీట్లు మనం ప్రతి రోజూ చూస్తూనే ఉంటాం. అయితే ఒక్కోసారి బ్యాటింగ్ చేసేటప్పుడు, బౌలింగ్ చేసేటప్పుడు, ఆఖరికి క్యాచులు పట్టేటప్పుడు కూడా ఆటగాళ్లు గాయాల బారిన పడుతుంటారు. అయితే నిన్న జరిగిన కోల్‌కత్తా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో టామ్‌ కరన్‌ బౌలింగ్‌లో ప్యాట్ కమిన్స్ షాట్‌కు యత్నించాడు. అయితే ఆ క్యాచ్‌ను సంజూ శాంసన్ అందుకుని అదుపు తప్పడంతో అతడి తల నేలకి బలంగా తగిలింది. ఆ సమయంలో కాసేపు శాంసన్ బాగా ఇబ్బందిపడ్డాడు.

అయితే ఇదే తరహాలో 1992 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో క్యాచ్ పట్టే సమయంలో సచిన్ టెండూల్కర్‌కి ఇలానే దెబ్బతగిలింది. అయితే ఈ రెండిటిని కలిపి ఓ క్రికెట్ అభిమాని షేర్ చేయగా సచిన్ అతడికి థ్యాంక్స్ చెబుతూ క్యాచ్ పట్టే సమయంలో బ్యాలెన్స్ తప్పి తల నేలకు తగిలితే ఎంత బాధ ఉంటుందో తనకు తెలుసని చెప్పుకొచ్చారు.