ఆసుపత్రిలో చేరిన సచిన్…పదేళ్లు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉంది

Friday, April 2nd, 2021, 02:12:57 PM IST

లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆసుపత్రి లో చేరాడు. ఇటీవల సచిన్ కి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే సరిగ్గా ఆరు రోజుల తర్వాత సచిన్ ఆసుపత్రి లో చేరాడు. అయితే ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అంతేకాక నేటికీ శ్రీలంక పై ఫైనల్ మ్యాచ్ లో గెలిచి ప్రపంచ కప్ ను అందుకొని సరిగ్గా పదేళ్లు పూర్తి అవ్వడం తో సంతోషం వ్యక్తం చేశారు సచిన్.

అందరికీ నమస్కారం, నేను బాగానే ఉన్నా, వైద్యుల సలహా మేరకు ఆసుపత్రి లో చేరాను అంటూ సచిన్ టెండూల్కర్ చెప్పుకొచ్చారు. అయితే కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వెంటనే ఇంటికి తిరిగి వస్తాను అని పేర్కొన్నారు. అయితే తన కోసం ప్రార్థించిన అందరికీ కూడా కృతజ్ఞతలు అని వ్యాఖ్యానించారు. అయితే 2011 ప్రపంచ కప్ సాధించి ఈరోజు తో సరిగ్గా పది సంవత్సారాలు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందని సచిన్ టెండూల్కర్ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా భారతీయులందరికీ, తోటి ఆటగాళ్లకు శుభాకాంక్షలు అంటూ చెప్పుకొచ్చారు సచిన్. అయితే ప్రపంచ కప్ గెలిచి పదేళ్లు పూర్తి కావడం తో అభిమానులు సోషల్ మీడియాలో ఆనాటి ఫోటోలను షేర్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు.