రజినీ ఫాలోయింగ్ చూసి షాకైన సచిన్

Sunday, October 4th, 2015, 11:35:13 AM IST


ఇండియన్ సూపర్ లీగ్ రెండో సీజన్ ఓపెనింగ్ సెర్మొనీ గురించి మాట్లాడుతూ సచిన్,రజినీ పై తన ట్విట్టర్లో కొన్ని ఆసక్తికరమైన ట్వీట్లు చేశారు. ఇండియన్ సూపర్ లీగ్ రెండో సీజన్ శనివారం చెన్నైలో అతిరధమహారధుల సమక్షంలో అట్టహాసంగా ప్రారంబమైంది.సాయంత్రం 6గంటలకు జవహర్ లాల్ స్టేడియంలో ప్రారంభమైన ఈ వేడుకలకు బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.తొలుత విశ్వసుందరి ఐశ్వర్య రాయ్,నటి ఆలియా భట్ నృత్యాలు ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి.ఈ వేడుకకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్,తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్,అమితాబ్ బచ్చన్,కార్పోరేట్ దిగ్గజం ముఖేష్ అంబానీ హాజరయారు.ఈ సందర్బంలో వేదికపైకి కేరళ బ్లాస్టర్స్ సహా యజమాని సచిన్ ను ఆహ్వానించగా స్టేడియం మొత్తం ఒక్కసారిగా హోరెత్తింది.తరువాత ఐశ్వర్య రాయ్,నటి ఆలియా భట్ వేదికపైకి రావడంతో ప్రేక్షకుల్లో ఉత్సాహం మరింత రెట్టింపైంది.

సూపర్ స్టార్ రజినీకాంత్ ఓపెన్ టాప్ జీపులో ఫుటబాల్ ను తీసుకుని వేదికపైకి వచ్చి నీతూ అంబానీకి అందించి ఇండియన్ సూపర్ లీగ్ రెండో సీజన్ ను ప్రారంబించారు.రజినీ వేదికపైకి రాగానే తమిళ ప్రేక్షకులు ఒక్కసారి రజినీ..,రజినీ.. అనే అరుపులతో స్టేడియాన్ని హోరెత్తించారు.అంతమంది స్టార్లున్నా కూడా ఓపెనింగ్ సెర్మొనీలో రజినీయే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.రజినీ చరీష్మాని చూసిన పెద్దలందరూ ఆశ్చర్యపోయారు.రజినీ ఫాలోయింగ్ చూసి ఫిదా అయిన సచిన్ తన ట్విట్టర్ లో సెర్మొనీ గురించి మాట్లాడుతూ ‘రజినీ అత్యుత్సాహం సెర్మొనీ వేడుకల్లో ఒక ఇన్ఫెక్షన్ లా పాకింది’ అని ట్వీట్ చేశారు.