ఆమె సెల్ఫీ దిగితే.. అందులో దెయ్యం వచ్చింది..!

Saturday, January 2nd, 2016, 10:25:09 AM IST

russainghost

సెల్ఫీ తీసుకుంటే.. అందులో మన ఫోటోనే ఉంటుంది. లేదంటే.. మనం ఎవరితో కలిసి ఫోటో దిగామో వాళ్ళ ఫోటో కూడా ఉంటుంది. కాని, ఓ మహిళా విమానంలో సెల్ఫీ దిగితే.. ఆ సెల్ఫీలో ఆమెతో పాటు వెనక ఓ దెయ్యం కూడా పడిందట. ఈ సంఘటన రష్యాలో జరిగింది. ఇక వివారాలలోకి వెళ్తే..

రష్యాకు చెందిన మహిళా పారిశ్రామికవేత్త ఒలేష్యా విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఎందుకో సెల్ఫీ తీసుకోవాలని అనుకున్నది. వెంటనే సెల్ఫీ తీసుకున్నది. అలా సెల్ఫీ దిగిన వెంటనే.. సదరు మహిళ దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతే.. సోషల్ మీడియాలో ఆమె హితులు, సన్నిహితులు అంతా కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. దెయ్యంతో సెల్ఫీ తీయించుకున్నావు ఏమిటని కొందరంటే.. కొందరేమో గ్రహాంతర వాసితో ఫోటో దిగావు ఏమిటి అని కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఒలేష్యా షాక్ తిన్నది. ఒలేష్యా తీసుకున్న సెల్ఫీలో ఆమె వెనుక ఓ ఆకారం కనిపిస్తున్నది. ఆ ఆకారాన్ని కొంతమంది దెయ్యం అంటే మరికొందరు కాదు, గ్రహాంతర వాసి అంటున్నారు. ఎవరు ఏమన్నా.. ఆ సెల్ఫీ దిగిన తరువాత పాపం ఒలేష్యాకు నిద్ర కరువైంది అని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నది.