కరోనా విషయంలో ఆసక్తికర అంశాన్ని వెల్లడించిన రష్యా శాస్త్రవేత్తలు.!

Tuesday, August 4th, 2020, 12:59:56 PM IST

ప్రస్తుతం ప్రపంచ దేశాలు అంతా కరోనాతో పోరాడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. దాదాపు 8 నెలల నుంచి ప్రపంచ వ్యాప్తంగా మందు లేని ప్రమాదకారి వైరస్ తో నిరంతర పోరాటం చేస్తూనే ఉన్నాము. ఇప్పటికే కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే దీనికి ఇంకా సరైన వాక్సిన్ రాకపోవడంతో చాలా వరకు నివారణ తోనే దీనిని అడ్డుకోవాలని శాస్త్రజ్ఞులు ఎప్పటి నుంచో చెప్తున్నారు.

ఇప్పటికే పలు ఆరోగ్య సలహాలను డాక్టర్లు సూచిస్తున్నారు. ఇంట్లోనే ఉండి చిన్న చిన్న జాగ్రత్తలను తీసుకున్నట్లయితే కరోనా బారి నుంచి తప్పించుకోవచ్చని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు రష్యాకు చెందిన శాస్త్రవేత్తలు ఓ తాజా అంశాన్ని వెల్లడించినట్టు తెలుస్తుంది.

సాధారణ తాగు నీటిని ఎక్కువగా తీసుకోవడం ద్వారానే కరోనాను వైరస్ ను అరికట్టడం సాధ్యం అవుతుంది అని ఈ తాగు నీటిని తీసుకోవడం ద్వారానే శరీరంలో రోగ నిరోధక శక్తి ఎక్కువవుతుందని అలాగే 90 శాతం వరకు కరోనా సాధారణ గాడి ఉష్ణోగ్రత వద్ద అయితే 24 గంటల్లో కరోనా నీటిలో ఉంటే నశిస్తుంది అని వెల్లడించారు. అలాగే 72 గంటల్లో అయితే 99 శాతం వరకు నశిస్తుంది అని వారు తెలిపారు.