గుడ్‌న్యూస్: ప్రపంచంలోనే తొలి కరోనా వ్యాక్సిన్ విడుదల చేసిన రష్యా..!

Tuesday, August 11th, 2020, 03:09:13 PM IST

ప్రస్తుతం ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తుంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ మహమ్మారి వ్యాధికి మందు ఎప్పుడొస్తుందా, ఎవరు కనిబెడతారా అని అన్ని దేశాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు.

అయితే తాజాగా రష్యా కరోనా వ్యాక్సిన్‌ను విడుదల చేసింది. ప్రపంచంలోనే తొలి వ్యాక్సిన్ రష్యాదే అని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ చెప్పుకొచ్చాడు. గామలేయ ఇన్‌స్టిట్యూట్ వారు ఈ వ్యాక్సిన్‌ని రూపొందించగా, ఈ వ్యాక్సిన్‌ను ముందుగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ కూతురితో సహా పలువురుపై విజయవంతంగా ప్రయోగించారు. అయితే ఈ వ్యాక్సిన్‌ను తొలుత వైద్యులు, సిబ్బందికి అందించనున్నారు.