నేటి నుండి తెలంగాణ ఆర్టీసి సర్వీసుల సమయాల్లో మార్పులు

Thursday, June 10th, 2021, 07:33:53 AM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే లాక్ డౌన్ ను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే లాక్ డౌన్ ను పొడిగించినప్పటికీ సడలింపు వేళలు సైతం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకూ పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం తో రాష్ట్రం లో పలు కార్యాలయాలు సాయంత్రం వరకు తెరుచుకొనున్నాయి. అంతేకాక నేటి నుండి తెలంగాణ ఆర్టీసి బస్సు సర్వీసుల సమయాల్లో మార్పులు వచ్చాయి. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జిల్లాలలో ఆర్టీసి బస్సులు తిరగనున్నాయి. అంతేకాక నేటి నుండి తెలంగాణ లో 3,600 బస్సు సర్వీసులు, హైదరాబాద్ లో 800 సిటీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. అయితే రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉండటం తో ప్రజలు మరింత అప్రమత్తం గా ఉండాలని, మాస్క్ లు పెట్టుకొని, భౌతిక దూరం పాటించాలి అని నిపుణులు సూచిస్తున్నారు. అవసరం ఉంటేనే తప్ప బయటికి రావొద్దు అంటూ చెప్పుకొస్తున్నారు.