యూట్యూబ్‌లో రికార్డులు కొల్లగొడుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ టీజర్..!

Saturday, December 19th, 2020, 07:55:25 PM IST

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్‌లు హీరోలుగా కలిసి నటిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మహాబలేశ్వరంలో జరుగుతోంది.

ఇదిలా ఉంటే దసరా కానుకగా మరియు కొమరం భీమ్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ లుక్‌ని రివీల్ చేస్తూ టీజర్‌ని రిలీజ్ చేసింది చిత్ర బృందం. అయితే ఈ టీజర్ ప్రస్తుతం యూట్యూబ్‌లో రికార్డులను కొల్లగొడుతుంది. ఈ టీజర్‌కు ఇప్పటి వరకు దాదాపు 3కోట్లకు పైగా వ్యూస్ రాగా, 5 లక్షల కామెంట్లు, 12 లక్షల లైకులు సాధించి సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. టాలీవుడ్‌లో ఈ రేంజ్‌లో కామెంట్లను దక్కించుకున్న తొలి టీజర్‌గా ఇది నిలవడం విశేషం.