“ఆర్ఆర్ఆర్” అభిమానులకు దీపావళి సర్ప్రైజ్

Friday, November 13th, 2020, 01:27:27 PM IST

జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రౌద్రం రణం రుధిరం చిత్రం కి సంబంధించిన అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే అనుకోని విధంగా ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు ఆర్ ఆర్ ఆర్ చిత్ర యూనిట్. దర్శకుడు రాజమౌళి ఎన్టీఆర్ ను కొమురం భీమ్ గా, రామ్ చరణ్ ను అల్లూరి సీతారామరాజు పాత్ర లో చూపించనున్నారు. అయితే ఈ చిత్రంలో వారి సరసన హీరోయిన్ లు గా అలియా భట్ మరియు ఒలివియా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, మరియు శ్రియ లు సైతం కీలక పాత్ర పోషిస్తున్నారు.

అయితే శనివారం నాడు పండుగ రోజు కావడం తో చిత్ర యూనిట్ పలు ఫొటోలను విడుదల చేసింది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మరియు రాజమౌళి కలిసి ఉన్న ఫోటో తో పాటుగా, జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి ఉన్న ఫొటోలను కూడా ఆర్ ఆర్ ఆర్ యూనిట్ విడుదల చేసింది. అంతేకాక వీరి సింగిల్ పిక్స్ కూడా పోస్ట్ చేయడం జరిగింది. తమ అభిమాన హీరోలు సంప్రదాయ పద్ధతిలో కనిపించడం తో ఫొటోలను సోషల్ మీడియా వేదిక గా తెగ షేర్ చేస్తున్నారు. అవేంటో మీరు ఓ లుక్కేయండి.