శరవేగంగా “ఆర్ ఆర్ ఆర్” షూటింగ్

Tuesday, November 17th, 2020, 01:05:58 PM IST

జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రౌద్రం రణం రుధిరం చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రం లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ పాత్రల్లో కనిపించనున్నారు. అయితే చలిలో సైతం వీరు షూటింగ్ ను చేస్తూ చిత్రాన్ని వీలైన త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. అయితే అందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. చలిలో కూడా రాజమౌళి తన చిత్ర యూనిట్ కి సన్నివేశాలను వివరిస్తున్నారు. ఈ వీడియో లో తారక్ సైతం కనిపించారు.

అయితే చలినీ సైతం లెక్క చేయకుండా చలిమంటలు కాచుకుంటూ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్న చిత్ర యూనిట్ పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రముఖులు కూడా దీనికి స్పందిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది విడుదల కావాల్సి ఉండగా, కరోనా వైరస్ కారణం గా వచ్చే ఏడాది కి విడుదల కానుంది. ఈ చిత్రం లో అలియా భట్, ఒలివియా మోరిస్ లో కథానాయికలు గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం కీరవాణి అందిస్తున్నారు.