ఆచార్య, రాధే శ్యామ్, పుష్ప చిత్ర యూనిట్ లకు ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఛాలెంజ్!

Wednesday, November 11th, 2020, 12:48:41 PM IST

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అంటూ తెలుగు రాష్ట్రాల్లో ఛాలెంజ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఎంపీ సంతోష్ మొదలు పెట్టిన ఈ కార్యక్రమం టాలీవుడ్ లో దూసుకుపోతుంది. అయితే తాజాగా ప్రభాస్ ఇచ్చిన ఛాలెంజ్ ను పూర్తి చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అలియా భట్, రాజమౌళి, ఆర్ ఆర్ ఆర్ టీమ్ కి రామ్ చరణ్ ఛాలెంజ్ విసిరారు. అయితే రామ్ చరణ్ ఛాలెంజ్ ను ఆర్ ఆర్ ఆర్ టీమ్ అంగీకరించి మొక్కలు నాటింది. దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తో పాటుగా చిత్ర యూనిట్ మొక్కలు నాటి అందుకు సంబంధించిన వీడియో ను పోస్ట్ చేయడం జరిగింది.

అయితే చివరలో ఈ చిత్ర యూనిట్ ఇదే ఛాలెంజ్ ను మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య టీమ్ కి, అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప టీమ్ కి అదే విధంగా ప్రభాస్ హీరోగా వస్తున్న రాధే శ్యామ్ టీమ్ కి ఛాలెంజ్ విసిరింది. అయితే రౌద్రం రణం రుధిరం చిత్ర షూటింగ్ లో టీమ్ బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. అల్లూరి సీతారామరాజు పాత్ర లో రామ్ చరణ్, కొమరం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.