ఎన్‌టీఆర్ ఖాతాలో మరో సరికొత్త రికార్డ్..!

Saturday, November 14th, 2020, 08:36:58 PM IST

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్‌లు హీరోలుగా కలిసి నటిస్తున్న చిత్రం RRR. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే దాదాపుగా ఈ సినిమా 80 శాతం షూటింగ్ పూర్తిచేసుకుంది.

ఇదిలా ఉంటే ఇటీవల దసరా కానుకగా మరియు కొమరం భీమ్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ లుక్‌ని రివీల్ చేస్తూ రిలీజ్ చేసిన టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే ఈ టీజర్ ఇప్పుడు సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. టాలీవుడ్‌లో తొలిసారి మిలియ‌న్ లైక్స్ సాధించిన టీజ‌ర్‌గా, అంతేకాకుండా మొట్ట‌మొదటి ల‌క్ష కామెంట్స్ సంపాదించిన టీజ‌ర్‌గా, వీటికి తోడు ఫాస్టెస్ట్‌గా 30 మిలియ‌న్ వ్యూస్ సాధించిన టీజ‌ర్‌గాను రికార్డు క్రియేట్ చేసింది. RRR పేరుకు తగ్గట్టుగానే ఒకేసారి ట్రిపుల్ రికార్డులు నమోదయ్యేసరికి ఎన్టీఆర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.