ఆర్ ఆర్ ఆర్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్… వైరల్ అవుతోన్న పోస్టర్!

Monday, January 25th, 2021, 02:20:33 PM IST

జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌద్రం రణం రుధిరం చిత్రం విడుదల పై ఎట్టకేలకు ఒక క్లారిటీ వచ్చింది. ఈ చిత్రం ఈ ఏడాది అక్టోబర్ 13 కి విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్త యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ చిత్రం విడుదల తేదీ ను ఒక పోస్టర్ ద్వారా విడుదల చేశారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు ఇద్దరు కలిసి ఉన్న ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ గుర్రపు స్వారీ చేస్తూ కనిపించగా, జూనియర్ ఎన్టీఆర్ బులెట్ పై గర్జిస్తూ ఉన్నాడు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ పోస్టర్, విడుదల తేదీ ల పై ప్రముఖులు స్పందిస్తున్నారు. అప్పటి వరకు ఆసక్తి గా ఎదురు చూసేందుకు సిద్దం అన్నట్లు గా కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్రం లో అలియా భట్, ఒలివియా మోరిస్, అజయ్ దేవగన్, శ్రియ లతో పాటుగా సముద్ర ఖని, పలువురు ప్రముఖులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం కీరవాణి అందిస్తున్నారు. ఈ చిత్రం కోసం కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా, యావత్ భారత దేశం ఎదురు చూస్తుంది.