ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులకు మాంచి కిక్ ఇస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ పోస్ట్!

Friday, February 5th, 2021, 03:39:09 PM IST

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌద్రం రణం రుధిరం చిత్రం క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ చిత్రం లో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ లు నటిస్తున్నారు. మొదటి సారిగా ఇద్దరు స్టార్ హీరో లు పవర్ ఫుల్ పాత్రల్లో నటిస్తూ అభిమానుల్లో భారీ అంచనాలే నింపేశారు. అయితే ఈ చిత్రం ను ఇప్పటికే అక్టోబర్ 13 న విడుదల చేసేందుకు చిత్రం యూనిట్ సన్నాహాలు చేస్తుంది. అయితే తాజాగా ఈ చిత్ర యూనిట్ సోషల్ మీడియా లో ఒక పోస్ట్ చేసింది. రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ లు ఇద్దరు ఉన్న ఫోటోలను రెండు షేర్ చేయడం జరిగింది.

అయితే ఈ ఫోటోల్లో ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో ఉండటం, ఇద్దరినీ కూడా చాలా హ్యండ్సం గా చూపించడం జరిగింది. క్లైమాక్స్ షూటింగు చిత్రీకరణ లో ఇద్దరు అలా కూర్చొని ఉన్న ఫొటొలు షేర్ చేయడం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అటు ఎన్టీఆర్ అభిమానులు, ఇటు రామ్ చరణ్ అభిమానులు ఫోటోలను షేర్ చేస్తున్నారు. నచ్చిన హీరో పై కామెంట్స్ చేస్తున్నారు. అయితే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ల సరసన ఒలివియా మోరిస్, అలియా భట్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, శ్రియ శరణ్ లతో పాటుగా సముధ్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.