ఊహించని రీతిలో ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్?

Monday, March 8th, 2021, 02:30:03 PM IST

దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రౌద్రం రణం రుధిరం. ఈ చిత్రం లో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ లు నటిస్తున్నారు. అయితే ఈ సినిమా ను రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. బాహుబలి సిరీస్ చిత్రాల తర్వాత జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న చిత్రం కావడంతో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ పాన్ ఇండియన్ హీరో గా ఎదగడానికి రాజమౌళి కారణం అని చెప్పాలి. అయితే ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం లో క్లైమాక్స్ కొంచెం విభిన్నంగా ఉండనుంది అని తెలుస్తోంది.

క్లైమాక్స్ లో భారీ సన్నివేశాల పోరాటం లో కొమురం భీం మరియు అల్లూరి సీతారామరాజు లకు ఒకరి కి కళ్ళు పోతే మరొకరికి కాళ్ళు పోతాయట. అయినప్పటికీ శత్రుమూక్పతో పోరాడేందుకు ముందుకు సాగుతారు అని తెలుస్తోంది. కాళ్ళు కోల్పోయిన హీరో ను మరొక హీరో భుజం పై ఎత్తుకొని శత్రువులను అంతం చేసేందుకు ముందుకు పోతూనే ఉంటారు అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ క్లైమాక్స్ విషయం లో ఏవైనా మార్పులు ఉంటాయా, లేకపోతే ఇదే ఉంటుందా అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతోంది. తెలుగు సినీ పరిశ్రమ లో ఇలా నెగటివ్ షేడ్ వచ్చే లా ఎండింగ్ లను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. సై రా నరసింహ రెడ్డి, కలర్ ఫోటో, ఇటీవల వచ్చిన ఉప్పెన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటాయి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో అలియా భట్, ఒలివియా మోరిస్ లో హీరోయిన్లు గా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, శ్రియ శరణ్, సముద్ర ఖని లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 13 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.