కోహ్లీ డ్యాన్స్ పై రాజస్థాన్ రాయల్స్ ఫాస్ట్ బౌలర్ కామెంట్స్

Friday, October 16th, 2020, 02:04:53 PM IST

గురువారం నాడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరియు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మద్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందుగా కోహ్లీ వామప్ ను డ్యాన్స్ లా చేశాడు. అయితే ఈ డ్యాన్స్ వీడియో పై పలువురు కామెంట్స్ చేయగా, రాజస్థాన్ రాయల్స్ ఫాస్ట్ బౌలర్ జో ఫ్రా ఆర్చర్ ఫన్నీగా కామెంట్స్ చేశారు. గది తలుపు మూసి ఆమె రమ్మని చెప్పినప్పుడు అంటూ వ్యాఖ్యానించారు. అయితే కోహ్లీ డ్యాన్స్ ఇప్పటికే అభిమానులను విపరీతంగా ఆకట్టుకోగా, ఇప్పుడు ఆర్చర్ చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు. కోహ్లీ డ్యాన్స్ మరియు ఆర్చర్ కామెంట్స్ వైరల్ గా మారాయి.