చంద్రబాబు, లోకేష్ లు ఏడుస్తుంటారు..రోజా సంచలన కామెంట్స్.!

Saturday, August 1st, 2020, 12:27:35 PM IST

తాజాగా ఏపీ గవర్నర్ మూడు రాజధానుల అంశానికి ఆమోదం తెలిపిన సంగతి అందరికీ తెలిసిందే. అందుకే వైసిపి అధిష్టానం ఇప్పుడు ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ అంశం విషయంలో ఇతర పార్టీలలో ఇప్పటికే అలజడి మొదలయ్యింది.

ఇన్నాళ్లు పాటు దీనికి ఎలాంటి అధికారిక ఆమోదం రాకుండానే అమరావతి రైతులు మరియు ప్రతిపక్ష పార్టీ నేతలు పోరాటం చేసారు. మొత్తానికి ఈ అంశం మాత్రం ఒక రేంజ్ లో రచ్చ లేపుతుంది. ఇక దీనిపై వైసీపీ ఫైర్ బ్రాండ్ మరియు ఆ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా సెల్వమణి పలు సంచలన కామెంట్స్ చేసారు.

అభివృద్ధి ఏపీ వ్యాప్తంగా ఉండాలి అని జగన్ మూడు రాజధానుల అంశాన్ని తీసుకొచ్చారని దానికి గవర్నర్ గారు ఆమోదం తెలపడం ఆనందదాయకం అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ మూడు రాజధానులను అడ్డుకోడానికి చంద్రబాబు అండ్ కో చాలా కష్టపడ్డారు అని ఇక ఈ వార్త విన్నాకా నారా లోకేష్ మరియు చంద్రబాబు నాయుడులు ఏడుస్తూ కూర్చిని ఉండి ఉంటారని రోజా వారిపై మరోసారి సంచలన కామెంట్స్ చేసారు.