అమరావతి మగాళ్ళకు దమ్ము లేదా.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన రోజా..!

Monday, January 13th, 2020, 08:00:05 PM IST

ఏపీ రాజధాని అమరావతిలో గత కొద్ది రోజులుగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో కొందరు రాజకీయ నేతలు ఆడవాళ్ళను ముందు పెట్టుకుని ఉద్యమం చేస్తున్నారని, వాళ్ళు మాత్రం ఆడంగి వెధవల్లా వెనక దాక్కున్నారని ఆరోపణలు చేశారు.

అయితే మగాళ్ళకు ఉద్యమం చేసే దమ్ము లేక ఆడవాళ్ళను రోడ్లపైకి పంపి పోలీసులు కొట్టారంటూ ఆడంగి ఏడుపులు ఏడుస్తున్నారని అన్నారు. మీరు చేసిన తప్పులకు ఆడవారిని ఎందుకు బలి చేస్తున్నారంటూ, అక్కడి మహిళలంతా స్వార్ధం కోసమే ఉద్యమం చేస్తున్నారని అన్నారు. అయితే హైదరాబాద్ కూకట్‌పల్లి నుంచి మహిళలు బస్సుల్లో వచ్చి ఇక్కడ ధర్నాలు చేస్తున్నారని అన్నారు. లోకేష్ స్నేహితుడైన ఓ డైరెక్టర్ మన వాళ్లు హైదరాబాద్ నుంచి వెళ్లి బాగా ధర్నా చేస్తున్నారని ట్వీట్ చేశారంటూ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. అయితే రోజా వ్యాఖ్యలు రైతులను, మహిళలను మరింత రెచ్చగొట్టే విధంగా ఉండడంతో ఈ విషయంపై రాజధాని రైతుల, మహిళల సమాధానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.