ఇషాన్‌ని అందుకే సూపర్ ఓవర్‌కు పంపలేదు – రోహిత్ శర్మ

Tuesday, September 29th, 2020, 12:43:57 PM IST

ఉత్కంఠ భరితంగా సాగే ఐపీఎల్ మ్యాచ్‌లలో గెలుపెవరిది అనేది చివరి వరకు ఎవరూ ఊహించలేరు. ఏ నిమిషమైనా మ్యాచ్ మలుపు తిరిగే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ సీజ‌న్‌లో నిన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య వీరోచితమైన పోరు జ‌రిగింది. ఈ మ్యాచ్ టై అయ్యి సూపర్ ఓవర్ జరగడం మరింత ఉత్కంఠకు తెరలేపగా చివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించింది.

అయితే అప్పటివరకు మంచి టచ్‌లో ఉన్న ఇషాన్‌ కిషన్‌ను సూపర్ ఓవర్‌లో ఎందుకు ఆడించలేదన్న దానిపై ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ క్లారిటీ ఇచ్చారు. 58 బంతుల్లో 99 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ అప్పటికే బాగా అలసిపోయి ఉన్నాడని, అందుకే అతడిని మళ్లీ బ్యాటింగ్‌కు పంపకుండా అతడి స్థానంలో బ్యాటింగ్‌కి దిగని హార్ధిక్ పాండ్యాను పంపినట్టు రోహిత్ తెలిపాడు. హిట్టింగ్ చేస్తాడని పాండ్యాను పంపించామని, అన్నీ మనం అనుకునట్టు జరగవు అని అన్నాడు.