ఐపీఎల్: హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఖాతాలో మరో రికార్డ్..!

Thursday, September 24th, 2020, 12:21:49 PM IST

ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ అన్ని సీజన్లలో కలిపి అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు సొంతం చేసుకున్న తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. అయితే ఈ జాబితాలో క్రిస్‌గేల్ 21 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లు గెలవగా, డివిలియర్స్ 20, రోహిత్ శర్మ 18, ధోని 17, షేన్ వాట్సన్ 17 గెలుచుకున్నారు.

ఇదేకాకుండా రోహిత్ శర్మ ఐపీఎల్‌లో 200 సిక్స్‌ల క్లబ్‌లో కూడా చేరిపోయాడు. 326 సిక్సులతో క్రిస్ గేల్ ముందుండగా, 214 సిక్సులతో డివిలియర్స్, 212 సిక్సులతో ఎంఎస్ ధోని ఈ జాబితాలో ముందున్నారు. ఇదిలా ఉంటే రోహిత్ మరో 10 పరుగులు చేస్తే ఐపీఎల్‌లో 5000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. ఇక నిన్న కోల్‌కతా నైట్ రైడర్స్‌పై మ్యాచ్ గెలవడంతో ఈ సీజన్‌లో ముంబై బోణీ కొట్టింది.