ఫిట్నెస్ టెస్ట్ లో పాస్ అయిన రోహిత్ శర్మ

Friday, December 11th, 2020, 02:27:59 PM IST

ఆసీస్ టూర్ ఈసారి రోహిత్ శర్మ లేకుండానే టీమ్ ఇండియా ఒక వన్డే సీరీస్ ను, టీ20 సీరీస్ ను ముగించేసింది. అయితే ఇక మిగిలి ఉన్న టెస్ట్ సీరీస్ కోసం రోహిత్ శర్మ తాజాగా ఫిట్నెస్ టెస్ట్ లో పాల్గొన్నాడు. అయితే ఈ ఫిట్నెస్ టెస్ట్ లో రోహిత్ శర్మ పాస్ అయ్యాడు. ఈ విషయం రోహిత్ శర్మ అభిమానులకు కచ్చితంగా గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఈ ఏడాది కూడా వన్డే మ్యాచ్ లలో టీమ్ ఇండియా తరపున ఎక్కువ పరుగులు సాధించిన ఆటగాడిగా రోహిత్ తన పేరు లిఖించుకున్నాడు. అయితే ఈ ఒకటి మాత్రమే కాకుండా, రోహిత్ ఈ ఏడాది ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు.

అయితే ఆసీస్ తో జరగనున్న టెస్ట్ సీరీస్ కోసం డిసెంబర్ 14 న రోహిత్ శర్మ ఫ్లైట్ ఎక్కనున్నాడు. 14 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్న అనంతరం జనవరి లో జరగబోయే రెండు టెస్టు మ్యాచ్ లలో అడనున్నాడు.